ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతానంటున్నారు.. ఏమైనా అర్థం ఉందా?: పవన్ కల్యాణ్ పై చంద్రబాబు నిప్పులు
- విశాఖను అభివృద్ధి చేసింది నేనే
- ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట
- జగన్, గాలిలతో బీజేపీ నాటకాలు ఆడిస్తోంది
గాలి జనార్దన్ రెడ్డి, జగన్ లతో బీజేపీ నాటకాలు ఆడిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తన తమ్ముడు అని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారని... ఈ అన్నదమ్ములు ఇద్దరి సంగతి ఏంటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. వైయస్ హయాంలో గాలి జనార్దన్ రెడ్డి చేత బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ పెట్టించేందుకు యత్నించారని అన్నారు.