'ఎన్టీఆర్' బయోపిక్ పై అవన్నీ పుకార్లేనట!
Add ap7am to your home Screen

'ఎన్టీఆర్' బయోపిక్ పై అవన్నీ పుకార్లేనట!

  • ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ 
  • బసవతారకం పాత్రలో విద్యాబాలన్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ .. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఎన్టీఆర్ బాల్యం .. సినీరంగ ప్రవేశం .. రాజకీయ రంగప్రవేశం .. ఇవన్నీ కలుపుకుంటే ఈ సినిమా నిడివి చాలా ఎక్కువగా వుంటుందనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

 ఒక భాగాన్ని సంక్రాంతికి .. మరో భాగాన్ని 2019 మధ్య భాగంలో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ .. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందడం లేదనేది ప్రాజెక్టు నిర్వాహకుల వైపు నుంచి వినిపిస్తోన్న మాట. ఎన్టీఆర్ బయోపిక్ మొత్తం ఒక సినిమాగానే ఉంటుందనీ .. జూలై 5వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని వాళ్లు అన్నారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని స్పష్టం చేశారు.    
balakrishna
vidyabalan

More Telugu News