50 రోజులను పూర్తి చేసుకున్న 'మహానటి'
Add ap7am to your home Screen

50 రోజులను పూర్తి చేసుకున్న 'మహానటి'

  • సావిత్రి పట్ల గల అభిమానం 
  • ఆమె జీవితం పట్ల గల ఆసక్తి 
  • స్టార్ హీరో .. హీరోయిన్స్ వలన పెరిగిన క్రేజ్  
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా తెరకెక్కింది. సావిత్రి బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విజయవిహారం చేసింది. భారీ వసూళ్లతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమా తాజాగా 50 రోజులను పూర్తిచేసుకుంది.

కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాకి ఈ స్థాయి విజయం లభించడం నిజంగానే గొప్ప విషయం. సావిత్రికి గల క్రేజ్ .. ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి .. యూత్ లో క్రేజ్ వున్న హీరో హీరోయిన్స్ ముఖ్యమైన పాత్రలను పోషించడం .. అలాగే సీనియర్ ఆర్టిస్టుల కారణంగా చేకూరిన బలం ఈ సినిమా విజయంలో తమవంతు పాత్రను పోషించాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ ను ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో అగ్రస్థానంలో నిలబెట్టేసింది.  
keerthi suresh
samanta

More Telugu News