మా అమ్మ చెప్పేంతవరకూ 'శైలు'తో నా ఎంగేజ్ మెంట్ విషయం నాకు తెలియదు: శుభలేఖ సుధాకర్
Add ap7am to your home Screen

మా అమ్మ చెప్పేంతవరకూ 'శైలు'తో నా ఎంగేజ్ మెంట్ విషయం నాకు తెలియదు: శుభలేఖ సుధాకర్

  • జంధ్యాల గారు నా గురించి చెప్పారు 
  • బాలూగారు నన్ను గమనిస్తూ వచ్చారు 
  • ఆ తరువాత మా నాన్నగారితో మాట్లాడారు
తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా శుభలేఖ సుధాకర్ కి మంచి పేరుంది. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడే పాత్రలను మాత్రమే చేస్తూ ఆయన శభాష్ అనిపించుకున్నారు. అలాంటి శుభలేఖ సుధాకర్ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

"జంధ్యాల గారి సినిమా 'పడమటి సంధ్యారాగం'కోసం బాలూగారు యూఎస్ వెళ్లారు. అప్పుడు ఆయన శైలజకి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టుగా చెప్పారట. దాంతో తనకి తెలిసిన ఒక మంచి కుర్రాడు ఉన్నాడంటూ జంధ్యాల గారు నా పేరు చెప్పారు. అప్పటి నుంచి అయిదు సంవత్సరాల పాటు నాకు తెలియకుండానే బాలూగారు నన్ను గమనిస్తూ వచ్చారు. ఈ సంగతి ఆ తరువాత ఆయనే చెప్పారు. బాలూగారికి నమ్మకం కుదిరాక .. మా నాన్నగారితో మాట్లాడారు. ఓ రోజు ఉదయాన్నే మా అమ్మ నన్ను నిద్రలేపి త్వరగా వెళ్లి .. ఒక గోల్డ్ రింగ్ .. పట్టుచీర తీసుకుని రమ్మన్నారు. 'ఎవరికమ్మా' అని అడిగాను. 'శైలూతో ఈవేళ నీ ఎంగేజ్ మెంట్రా .. " అనేసింది మా అమ్మ. అలా నా ఎంగేజ్ మెంట్ నాకే సర్ ప్రైజ్ గా అనిపించింది" అని చెప్పుకొచ్చారు. 
subhalekha sudhakar

More Telugu News