ట్రంప్ కోసం పనిచేస్తున్నావని ఆరోపిస్తూ సారా సాండర్స్ ను గెంటేసిన రెస్టారెంట్!
- వైట్ హౌస్ మీడియా కార్యదర్శిగా ఉన్న సారా
- రెస్టారెంట్ కు వెళితే బయటకు వెళ్లిపోవాలని గద్దించిన యజమాని
- మౌనంగా వచ్చేశానని ట్విట్టర్ లో పేర్కొన్న సారా
తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించిన సారా, వర్జీనియాలోని లెక్సింగ్టన్ లో ఉన్న 'ద రెడ్ హెన్' రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగిందని, యజమానే స్వయంగా వెళ్లిపోవాలని చెప్పడంతో, తాను మౌనంగానే అక్కడి నుంచి వచ్చేశానని అన్నారు. ఈ ఘటనతో తానేమీ పెద్దగా బాధపడలేదని, రెస్టారెంట్ యజమానే తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడని అన్నారు. ఇక ఈ ట్వీట్ కు 22 వేలకు పైగా స్పందనలు రావడం గమనార్హం. వీటిల్లో ఆమెకు అనుకూలమైనవి, వ్యతిరేకమైనవి కూడా ఉన్నాయి.