వెంటనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం పిలుపు.. బయలుదేరిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి!
Add ap7am to your home Screen

వెంటనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం పిలుపు.. బయలుదేరిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి!

  • పార్టీకి దానం నాగేందర్‌ రాజీనామా 
  • తెలంగాణలో పార్టీ పరిస్థితులపై కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్చలు
  • సంస్థాగత మార్పులపై సమావేశం?  
టీపీసీసీ నేత దానం నాగేందర్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వెంటనే ఆయన హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులు, బలోపేతం, కొత్త కమిటీ ఏర్పాటు, సంస్థాగత మార్పులపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించనున్నట్లు తెలుస్తోంది. వార్ రూమ్ లో ఈ సమావేశం కొనసాగనుంది. 2019 ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించనున్నట్లు సమాచారం.   
Congress
Uttam Kumar Reddy
Telangana

More Telugu News