నాని 'జెర్సీ' మూవీలో కథానాయికగా కీర్తి సురేశ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని 'జెర్సీ' మూవీలో కథానాయికగా కీర్తి సురేశ్?

  • నాని హీరోగా 'జెర్సీ' 
  • దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి 
  • క్రికెట్ నేపథ్యంలో సాగే కథ
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఒక వైపున ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపున దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి 'జెర్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమా కోసం నాని క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక దర్శక నిర్మాతలు కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి .. కీర్తి సురేశ్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. గతంలో నాని .. కీర్తి సురేశ్ కలిసి నటించిన 'నేను లోకల్' హిట్ కావడం ఒక కారణమైతే, 'మహానటి' హిట్ తో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోవడం మరొక కారణం. నాని కూడా కీర్తి సురేశ్ ఎంపిక వైపే మొగ్గు చూపడంతో, దర్శక నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.         
nani
keerti suresh

More Telugu News