'సర్కార్'గా విజయ్ .. ఫస్టులుక్ తోనే అదరగొట్టేశాడు
Add ap7am to your home Screen

'సర్కార్'గా విజయ్ .. ఫస్టులుక్ తోనే అదరగొట్టేశాడు

  • విజయ్ హీరోగా 'సర్కార్'
  • మురుగదాస్ తో మూడో సినిమా
  • కథానాయికగా కీర్తి సురేశ్  
తమిళంలో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా వున్న స్టార్ హీరోగా విజయ్ కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన సినిమాల్లో ఉండేలా ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. అలా ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కి ఇది 62వ సినిమా .. ఈ రోజున విజయ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాకి 'సర్కార్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.ఫస్టులుక్ పోస్టర్స్ లో విజయ్ స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. మురుగదాస్ టేకింగ్ .. రెహ్మాన్ సంగీతం .. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ కనిపించనుందనే సంగతి తెలిసిందే. మురుగదాస్ .. విజయ్ కాంబినేషన్లో 'కత్తి' .. 'తుపాకి' తరువాత వస్తోన్న సినిమా కావడంతో, హ్యాట్రిక్ హిట్ ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.   
vijay
keerthi suresh

More Telugu News