ఎన్డీయే నుంచి నితీశ్ బయటకొస్తే.. మాతో కలుపుకుంటాం: కాంగ్రెస్
Add ap7am to your home Screen

ఎన్డీయే నుంచి నితీశ్ బయటకొస్తే.. మాతో కలుపుకుంటాం: కాంగ్రెస్

  • బీహార్‌లో బీజేపీ-జేడీయూ మధ్య విభేదాలు
  • 2019 లోక్ సభ సీట్ల సర్దుబాటుపై పరస్పర విరుద్ధ ప్రకటనలు
  • బీజేపీకి నితీశ్ దూరం జరుగుతున్నారంటూ వార్తలు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుని బయటకు వస్తే మహాకూటమిలో కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పేర్కొంది. ఒకవేళ అటువంటి పరిస్థితే ఎదురైతే కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ పేర్కొన్నారు. నితీశ్ కుమార్ తిరిగి వస్తానంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు.

2015లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ కలిసి మహాకూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ సీట్ల పంపకంపై బీజేపీ-జేడీయూ మధ్య విభేదాలు తలెత్తి, రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Bihar
nitish kumar
JDU
Congress

More Telugu News