తన భర్త వద్దకు వెళ్లాలని ఓ నిర్మాత భార్య నన్ను డిమాండ్ చేసింది: టాలీవుడ్ పాటల రచయిత్రి శ్రేష్ఠ షాకింగ్ కామెంట్స్
- క్యాస్టింగ్ కౌచ్ బారిన నేను కూడా పడ్డాను
- చేదు అనుభవాలు ఎదురయ్యాయి
- 'ఇండియా గ్లిట్జ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేష్ఠ
పురుషులతో పాటు మహిళలు కూడా క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడుతున్నారని చెప్పుకొచ్చిన శ్రేష్ఠ, ఓ నిర్మాత భార్య తనను ఆమె భర్త వద్దకు వెళ్లాలని డిమాండ్ చేసిందని చెప్పారు. ఒక వ్యక్తి తనపై మనసు పారేసుకున్నాడని, గోవాలో ఓ పార్టీ ఇస్తున్నాడని, అక్కడికి వెళ్లాలని ఓ మహిళా దర్శకురాలు చెప్పిందని అన్నారు. ఆ పార్టీకి తాను వెళ్లలేదని, దీంతో సదరు వ్యక్తి తనకు ఫోన్ చేసి చెడామడా తిట్టాడని వాపోయింది. నిస్సహాయురాలినైన తాను, వారిని హెచ్చరించి, కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యానని అన్నారు.