బిగ్‌బాస్-2లో తొలి రోజే రాజుకున్న వేడి.. సెలబ్రిటీలపై విరుచుకుపడిన సంజన!
- హౌస్ నుంచి సామాన్యులను బయటకు పంపే ప్రయత్నాలు
- ఇద్దరి పేర్లను సూచించిన సెలబ్రిటీలు
- హౌస్‌లోని జైలులో సంజన, నూతన్ నాయుడు
బిగ్‌బాస్ హౌస్‌లోకి అందరూ చేరుకున్నాక సామాన్యులకు సెలబ్రిటీలు షాకిచ్చారు. హౌస్ నుంచి బయటకు పంపేందుకు ఇద్దరిని ఎంచుకోవాలని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో సెలబ్రిటీలు అందరూ కలిసి సామాన్యులపై పడ్డారు. సంజన, నూతన్ నాయుడుల పేర్లను సూచించడంతో వారు షాకయ్యారు. బిగ్‌బాస్ ఆదేశాలతో సెలబ్రిటీలు సూచించిన సంజన, నూతన్ నాయుడులను హౌస్‌లో ఉన్న జైలులో పెట్టి బంధించారు. నేటి ఎపిసోడ్లో వీరిలో ఒకరిని బయటకు విడుదల చేస్తారు. ఆ ఒక్కరు ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్.
కాగా, ముగ్గురు మాత్రమే ఉన్న సామాన్యుల్లో ఇద్దరిని అప్పుడే బయటకు పంపే ఏర్పాట్లు జరుగుతుండడంపై సంజన ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతమంది సెలబ్రిటీలు ఉండగా తమ పేర్లను ఎలా సూచిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తొలి రోజే షో రసవత్తరంగా మారింది.