'బిగ్ బాస్ 2'లో నేను లేను .. ఇది కొందరికి సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు: శ్రీరెడ్డి
- బిగ్ బాస్ హౌస్ లో నేను కనిపించను
- ఇది నిజంగా నా దురదృష్టం
- పోటీదారులు అదృష్టవంతులు
ఇటీవలి కాలంలో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచిన సినీ నటి శ్రీరెడ్డి కూడా ఈ షోలో పాల్గొననున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఈ షోలో లేనని తాజాగా శ్రీ రెడ్డి చెప్పింది. "ఇది నా దురదృష్టం .. నా స్నేహితులకు చేదు వార్త .. నేను 'బిగ్ బాస్ 2'లో పాల్గొనడం లేదు. ఇది నా సన్నిహితులను అప్సెట్ చేసినా, కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. పోటీదారులు అదృష్టవంతులు .. 'బిగ్ బాస్ 2' బృందానికి ఆల్ ది బెస్ట్" అని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.