ప్రణబ్ ముఖర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసిన వైనం.. మండిపడ్డ ఆయన కూతురు
- నిన్న ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్
- ఓ మార్ఫింగ్ ఫొటో హల్‌చల్
- ఇటువంటి ట్రిక్స్ చేస్తారనే ఊహించానన్న శర్మిష్ట ముఖర్జీ
ఈ విషయాన్ని గుర్తించిన ప్రణబ్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ట ముఖర్జీ ఇలాంటిది జరుగుతుందని తాను ముందే తన తండ్రికి చెప్పానని బీజేపీపై ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి చేస్తారనే తాను భయపడ్డానని, తన తండ్రి మాట్లాడి కొన్ని గంటలైనా కాకముందే ఇటువంటి ట్రిక్స్ చేస్తూ అసత్య ప్రచారం చేశారని ఆమె అన్నారు.