ఉత్తేజ్ కుమార్తెను చూసి ఆనందబాష్పాలు రాల్చాను: తనికెళ్ల భరణి
- రవీంద్ర భారతిలో చేతన ఉత్తేజ్ ప్రదర్శన
- 'అష్టవిధనాయిక'ను ప్రదర్శించిన చేతన
- పొగడ్తలతో ముంచెత్తిన తనికెళ్ల
చేతన ప్రదర్శన చూసిన తరువాత నోట మాట రాలేదన్నారు. అత్యాచారాలను కథా వస్తువుగా చేసుకుని ఉత్తేజ్ స్వయంగా రచించిన ‘అనంత’ రూపకాన్ని చేతన సోలోగా ప్రదర్శించగా, ఆ కార్యక్రమంపైనా భరణి పొగడ్తలు కురిపించారు. సాత్విక అభినయం ప్రధానంగా ఓ రూపకాన్ని మాటలు లేకుండా రక్తి కట్టించడం గొప్ప విషయమని చేతన ప్రదర్శనను తిలకించిన తెలంగాణ రాష్ట్ర సలహాదారు కేవీ రమణాచారి వ్యాఖ్యానించారు.