విడిపోతున్నట్టు ప్రకటించిన బాలీవుడ్ జంట అర్జున్ రాంపాల్-మెహర్ రాంపాల్
- విడిపోయిన బాలీవుడ్ అందమైన జంట
- ఇకపై తమ మధ్య ఎటువంటి సంబంధాలు ఉండవని వ్యాఖ్య
- ఎన్నో మధురానుభూతులు ఉన్నాయన్నఅర్జున్-మెహర్
తమ 20 ఏళ్ల వైవాహిక జీవితం ఎంతో గొప్పదని, ప్రేమ, ఆప్యాయత, అందమైన జ్ఞాపకాలతో అది నిండిపోయిందని ఇద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఇద్దరం వేర్వేరుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఇకపై తమ మధ్య ఎటువంటి సంబంధాలు కొనసాగకపోయినప్పటికీ ప్రేమ మాత్రం నిలిచే ఉంటుందని పేర్కొన్నారు.