వేలూరులో టీవీ చానల్ కెమెరామెన్ దారుణ హత్య

26-05-2018 Sat 13:56 | National
  • కత్తితో పొడిచి చంపిన గంజాయి విక్రేతలు
  • పోలీసులకు సమాచారం అందించాడన్న కక్షతో హత్య
  • ఉదయం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ తమిళ టీవీ చానల్ లో కెమెరామెన్ గా పని చేస్తున్న అశోక్ కుమార్ అనే వ్యక్తిని గంజాయి విక్రేతలు కత్తితో పొడిచి హత్య చేశారు. తమిళనాడులోని వేలూరు పాత టౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి నిద్రపోతున్న అతనిపై అదే ప్రాంతానికి చెందిన రమేష్, అగస్టిన్, తిరుమలై అనే వ్యక్తులు దాడి చేశారు. ప్రతిఘటించిన అశోక్ ను కత్తితో పొడిచి, పరారయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని వేలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం నిందితులను అరెస్ట్ చేశారు.

రమేష్, అగస్టిన్, తిరుమలైలు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారాన్ని పోలీసులకు అశోక్ అందించాడన్న కక్షతోనే వారు ఈ హత్యకు పాల్పడినట్టు తెలిసింది. తిరుమలై అనే వ్యక్తి ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. జూదానికి సంబంధించిన గొడవలో ఓ ఆటోడ్రైవర్ ను బండతో మోది హత్య చేసిన కేసులో రెండు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు.
tvchannelcamaramenmurdervellore

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more