సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

26-05-2018 Sat 07:31 | Entertainment
  • విజయ్ దేవరకొండ సినిమాలో మల్లూ బ్యూటీ 
  • తమిళ, మలయాళ 'భరత్..' విడుదల వాయిదా 
  • నైజాంలో 'మహానటి' సంచలన షేర్ 
  • విలన్ పాత్రల వైపు సీనియర్ నటుడు
 *  మల్లూ బేబీ అనూ ఇమ్మానుయేల్ త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటించనుంది. పరశురాం దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అనూ ఇమ్మానుయేల్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందులో ఆమెది కీలక పాత్ర అని తెలుస్తోంది.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' తమిళ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ భాషల్లో ఈ రోజు విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఈ నెల 31కి వాయిదా వేశారు.
*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'మహానటి' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఈ చిత్రం నైజాం ఏరియాలో పదహారు రోజులకు గాను సుమారు 10 కోట్ల షేర్ ను వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
*  సీనియర్ నటుడు అర్జున్ విలన్ పాత్రల వైపు మళ్ళుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల 'ఇరుంబు తిరై' తమిళ చిత్రంలో విలన్ గా నటించిన అర్జున్ తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా నటించే ఓ చిత్రంలో కూడా విలన్ గా నటించడానికి అంగీకరించాడట. 
AnuVijayMaheshKeerthi

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more