ఎన్టీఆర్ మూవీలో మరో హీరోయిన్ గా అచ్చ తెలుగు అమ్మాయి!
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ మూవీలో మరో హీరోయిన్ గా అచ్చ తెలుగు అమ్మాయి!

  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ
  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
  • ఒక కథానాయికగా పూజా హెగ్డే
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ 'అరవింద సమేత వీర రాఘవ' సెట్స్ పైకి వెళ్లింది. ఎక్కడా గ్యాప్ లేకుండా ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.

 కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా అవసరం కావడంతో, తెలుగు బాగా మాట్లాడే హీరోయిన్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించారట. ఆ సమయంలోనే ఆయనకి 'అమీ తుమీ 'లో చేసిన తెలుగమ్మాయి 'ఈషా రెబ్బా' గుర్తుకు వచ్చిందట. అంతే, ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో ఈషా పాత్ర కొత్తగా వుండి .. ఆమె నటనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తుందని అంటున్నారు. త్రివిక్రమ్ మూవీలో .. అందునా ఎన్టీఆర్ సరసన ఛాన్స్ తగలడంతో ఈషా రెబ్బా ఆనందంతో పొంగిపోతోందట.  
ntr
eesha rebba

More Telugu News