కుటుంబ సభ్యులతో కలసి 'మహానటి'ని చూసిన బాలకృష్ణ
Add ap7am to your home Screen

కుటుంబ సభ్యులతో కలసి 'మహానటి'ని చూసిన బాలకృష్ణ

  • బాలకృష్ణ కోరిక మేరకు 'మహానటి' స్పెషల్ షో 
  •  ఆసక్తిగా వీక్షించిన బాలకృష్ణ 
  • దర్శక నిర్మాతలకు అభినందనలు
సావిత్రి చనిపోయి చాలాకాలమే అవుతోంది. ఆమె ఎందుకు తన ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మరణానికి చేరువయ్యారు? అనే సందేహాలు అప్పటి నుంచి అభిమానుల్లో తలెత్తుతూనే వున్నాయి. వాళ్ల సందేహాలకు సమాధానంగా 'మహానటి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమా దర్శక నిర్మాతలను చిరంజీవి స్వయంగా ఆహ్వానించి వాళ్లను సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న బాలకృష్ణ కోరిక మేరకు దర్శక నిర్మాతలు హైదరాబాదు, ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా వీక్షించినట్టు సమాచారం. ఈ సినిమా చూసిన బాలకృష్ణ దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని ఎంతగానో అభినందించాడని అంటున్నారు.  
keerthi suresh
dulquer

More Telugu News