సంచలనం సృష్టించిన సరస్వతి కేసులో మరో విస్తుపోయే నిజం వెల్లడి!
- పెళ్లి అయిన పది రోజులకే భర్తను హత్య చేయించిన సరస్వతి
- బెంగళూరు ముఠాతో హత్యకు ఒప్పందం
- రూ.25 వేలు అడ్వాన్స్‌గా చెల్లింపు
ప్రియుడు శివతో కలిసి పెళ్లికి ముందే రూ.25 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి హత్యకు కుట్ర పన్నినట్టు వివరించారు. ఈ సొమ్మును మొబైల్ యాప్ ద్వారా పంపారని తెలిపారు. ఒప్పందం చేసుకున్న ముఠా తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు విజయనగరానికి చెందిన మరో ముఠాతో డీల్ కుదుర్చుకున్నారని ఎస్పీ వివరించారు. కాగా, ఈ కేసులో సరస్వతి, ఆమె ప్రియుడు శివ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.