కేన్స్ ఫిలిం ఫెస్టివల్: కూతురు ఆరాధ్యతో కలిసి మెరిసిన ఐశ్వర్యరాయ్
Add ap7am to your home Screen

కేన్స్ ఫిలిం ఫెస్టివల్: కూతురు ఆరాధ్యతో కలిసి మెరిసిన ఐశ్వర్యరాయ్

  • కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 17వ సారి పాల్గొన్న ఐశ్వర్య రాయ్
  • ఊదా రంగు సీతాకోక చిలుకల గౌన్ ధరించిన ఐష్
  • ఆరాధ్యతో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచిన వైనం
ఫ్రాన్స్ లోని కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారతీయ నటీమణుల మెరుపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దీపికా పదుకొణే, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రాలు వైవిధ్యమైన దుస్తుల్లో మెరిసిపోయారు. తాజాగా, ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యారాయ్ అభిమానులను అలరించింది. ఊదా రంగు సీతాకోక చిలుకల డిజైన్ తో కూడిన గౌన్ ధరించి రెడ్ కార్పెట్ పై ఆమె మెరిసిపోయింది. 

ఈ గౌన్ నిదుబాయ్ కి చెందిన డిజైనర్ మైఖేల్ కిన్కో డిజైన్ చేశారు. ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం ఇది 17వ సారి కావడం విశేషం. కాగా, ఈ ఫెస్టివల్ కు కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య వెళ్లింది. ఆరాధ్యతో కలిసి రెడ్ కార్పెట్ పై నడవడాన్ని పలువురు ఆసక్తిగా గమనించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఐశ్వర్య రాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
cannes film festival
Aishwarya Rai
aaradhya

More Telugu News