ఉద్యోగుల తరపున ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే: దాసోజ్ శ్రావణ్
Add ap7am to your home Screen

ఉద్యోగుల తరపున ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే: దాసోజ్ శ్రావణ్

  • ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
  • ఏపీలో పని చేస్తున్న టీ-ఉద్యోగులను ఇక్కడికి రప్పించరే?
  • పీఆర్సీ వేసేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది?
తెలంగాణలోని ఉద్యోగుల తరపున ఎలాంటి పోరాటం చేసేందుకైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని, ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించడంలో టీ-సర్కార్ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని నాడు కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. పీఆర్సీ వేసేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలని శ్రావణ్ ప్రశ్నించారు. 
Telangana
Congress
dasoju

More Telugu News