పాపికొండలకు వెళుతున్న టూరిస్ట్ బోట్ లో అగ్నిప్రమాదం!
- 80 మంది టూరిస్టులతో ఉన్న బోటు
- షార్ట్ సర్క్యూట్ తో మంటలు
- యాత్రికుల్లో భయాందోళన
ఈ ఘటనతో యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురై, తమ సెల్ ఫోన్ల నుంచి దగ్గర్లో ఉన్న పరిచయస్తులకు, పోలీసులకు ఫోన్లు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే బోటు వద్దకు సహాయపు బోట్లను, గజ ఈతగాళ్లను పంపించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.