'మహానటి' సినిమాపై సావిత్రి కుమార్తె, అల్లుడి స్పందన
Add ap7am to your home Screen

'మహానటి' సినిమాపై సావిత్రి కుమార్తె, అల్లుడి స్పందన

  • చిన్నతనం నుంచి అగ్రనటిగా ఎదిగిన తీరును ఈ సినిమాలో చూశా
  • కీర్తి సురేష్ ను అమ్మే స్వయంగా ఎంచుకుందనిపిస్తోంది
  • అమ్మ కథను తెరకెక్కించడం సంతోషంగా ఉంది
దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఘన విజయం సాధించడం పట్ల సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి అగ్రనటిగా అమ్మ ఎదిగిన తీరును ఈ సినిమా ద్వారా చూశానని ఆమె అన్నారు. తన పాత్ర కోసం కీర్తి సురేష్ ను స్వయంగా అమ్మే ఎంచుకుందని అనిపిస్తోందని తెలిపారు. అమ్మ కథను తెరకెక్కించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

సావిత్రి అల్లుడు గోవింద్ మాట్లాడుతూ, సావిత్రిని మించిన నటి లేదని అందరూ అంటుంటారని... సావిత్రిని మించిన నటి రావాలని తాను అనుకుంటూ ఉంటానని చెప్పారు. 'మహానటి' చిత్రం ద్వారా తన కోరిక వాస్తవరూపం దాల్చిందని, సావిత్రిని మించి కీర్తి సురేష్ నటించిందని తెలిపారు. సావిత్రి జీవిత చరిత్రతో సినిమా రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. 
mahanati
savitri
daughter
keerthi suresh

More Telugu News