సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించలేదు.. జీవించింది!: కేటీఆర్ ప్రశంస
Add ap7am to your home Screen

సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించలేదు.. జీవించింది!: కేటీఆర్ ప్రశంస

  • సినిమా యూనిట్‌పై కేటీఆర్ ప్రశంసలు
  • అందరూ అద్భుతంగా నటించారంటూ ట్వీట్
  • హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ‘మహానటి’
బోల్డన్ని అంచనాల మధ్య విడుదలైన ‘మహానటి’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు దర్శకుడు, నటీనటులు సహా చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంచనాలకు మించి ఉందంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

సావిత్రి జీవిత కథాంశంతో రూపొందించిన ఈ సినిమాను చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ జీవించిందని కొనియాడారు. ఇంత మంచి చిత్రాన్ని అందించినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యలు అద్భుతంగా నటించారని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Mahanati
KTR
keerthi suresh
Savithri
Tollywood

More Telugu News