'ఎన్టీఆర్' సినిమా కోసం క్రిష్ తో సంప్రదింపులు... లైన్లో వైవీఎస్ చౌదరి పేరు కూడా!
Add ap7am to your home Screen

'ఎన్టీఆర్' సినిమా కోసం క్రిష్ తో సంప్రదింపులు... లైన్లో వైవీఎస్ చౌదరి పేరు కూడా!

  • తేజ తప్పుకున్న తరువాత క్రిష్ పేరు
  • వైవీఎస్ చౌదరి, రాఘవేంద్రరావు పేర్లు కూడా
  • ఇంకా నిర్ణయం తీసుకోని బాలకృష్ణ
ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్న తరువాత సినిమా దర్శకత్వ బాధ్యతలను రాఘవేంద్రరావుకు ఇస్తారని వార్తలు రాగా, ఇప్పుడు తాజాగా క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి దర్శకత్వం వహించి, ఆ సినిమాను సూపర్ హిట్ గా నిలిపిన క్రిష్ తో బాలయ్య వర్గం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించాలని రాఘవేంద్ర రావును కోరగా, ఆయనింకా సమాధానం చెప్పలేదన్నది టాలీవుడ్ తాజా టాక్. తన జీవితంలో ఎన్నడూ ఓ సినిమా మధ్యలో ప్రవేశించి దర్శకత్వం చేయని రాఘవేంద్రరావు ఈ ప్రాజెక్టుకు ఒప్పుకుంటారా? అన్నది సందేహమేనని భావిస్తున్నందునే బాలయ్య బృందం మరో దర్శకుడి వేటలో పడిందని, ముందుగా ఆ చాన్స్ క్రిష్ కే ఇవ్వాలన్నది బాలకృష్ణ అభిమతమని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన దర్శకుడు వైవీఎస్ చౌదరి పేరును కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ గురించి చౌదరికి ఎక్కువగా తెలుసునని భావిస్తున్న బాలకృష్ణ ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే.
Krish
Balakrishna
YVS Chowdary
NTR
Biopic

More Telugu News