నేను ఎల్లప్పుడూ నిస్వరుడిని, నిస్సహాయుడిని: పవన్ కల్యాణ్ లేటెస్ట్ ట్వీట్
Add ap7am to your home Screen

నేను ఎల్లప్పుడూ నిస్వరుడిని, నిస్సహాయుడిని: పవన్ కల్యాణ్ లేటెస్ట్ ట్వీట్

  • వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పవన్
  • మార్టిన్ నైమోలర్ కోట్ ను ప్రస్తావించిన పవన్
  • వైరల్ అవుతున్న తాజా ట్వీట్
గడచిన రెండు మూడు రోజులుగా తన సోషల్ మీడియా ఖాతాల్లో వరుసగా పోస్టులు పెడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, తానెప్పుడూ నిస్వరుడిని, నిస్సహాయుడినేనంటూ, మార్టిన్ నైమోలర్ కోట్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. "తొలుత కమ్యూనిస్టుల కోసం వారు వచ్చారు. కమ్యూనిస్టును కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తరువాత సోషలిస్టుల కోసం వారు వచ్చారు. సోషలిస్టును కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తదుపరి వర్తక సంఘాల కోసం వారు వచ్చారు. వర్తక సంఘాల వ్యక్తిని కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. ఆపై యూదుల కోసం వారు వచ్చారు. యూదుడిని కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. ఆ తరువాత నా కోసం మాట్లాడాల్సి వచ్చేసరికి ఒక్కరు కూడా మిగల్లేదు" అన్న వ్యాఖ్యలున్న పోస్టర్ ను పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Pawan Kalyan
Twitter
Social Media
Post

More Telugu News