మీరు నా తల్లిని తిట్టినా నాకు కోపం రాకూడదా?: పవన్ కల్యాణ్‌
Add ap7am to your home Screen

మీరు నా తల్లిని తిట్టినా నాకు కోపం రాకూడదా?: పవన్ కల్యాణ్‌

  • భారీగా తరలివచ్చిన అభిమానులతో పవన్ ముచ్చట
  • చివరికి నా తల్లిని బజారుకీడ్చారు
  • ఇష్టం వచ్చినట్లు ప్రసారాలు చేస్తే ఊరుకోవాలా?
  • నేను నిగ్రహంతో ఉండాలని కొందరు అంటున్నారు
పలు తెలుగు టీవీ ఛానెళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈ రోజు అభిమానులతో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి భారీగా తరలివచ్చిన తన అభిమానులతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తన తల్లిని చివరికి బజారుకీడ్చారని, ఇష్టం వచ్చినట్లు ప్రసారాలు చేస్తే ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.

తాను నిగ్రహంతో ఉండాలని కొందరు అంటున్నారని, చేసిందంతా చేసి నిగ్రహంతో ఉండాలని అనడమేంటని అన్నారు. తన తల్లిని తిట్టినా తనకు
చిన్నపాటి కోపం కూడా రాకూడదా? అని అన్నారు. నా ఫ్యాన్స్‌ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? నేనా? వాళ్లా? అని ప్రశ్నించారు. తొందరపడి దాడులకు దిగొద్దని తన అభిమానులకు పవన్ కల్యాణ్ సూచించారు. 8 నెలలుగా తనను టార్గెట్ చేస్తున్నారని, తాను సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేస్తున్నానని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలని హితవు పలికారు. 
Pawan Kalyan

More Telugu News