ఆస్ట్రేలియాలోను 'భరత్' హవా .. అక్కడా ఓ రికార్డు!
Add ap7am to your home Screen

ఆస్ట్రేలియాలోను 'భరత్' హవా .. అక్కడా ఓ రికార్డు!

  • తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న 'భరత్ అనే నేను'
  • అమెరికాలోను అదే జోరు 
  • ఆస్ట్రేలియాలోను రికార్డు         
ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'భరత్ అనే నేను' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. కథా కథనాల పరంగా .. టేకింగ్ పరంగా .. మహేశ్ బాబు లుక్స్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ .. అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియాలోను మహేశ్ బాబుకి మంచి క్రేజ్ వుంది. అక్కడ పెద్దసంఖ్యలో మహేశ్ సినిమాలను ఇష్టపడేవారు వున్నారు.

 అందువల్లనే ఆస్ట్రేలియాలో తొలిరోజునే ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడ 35 లొకేషన్లలో విడుదలైన ఈ సినిమా, 1.68 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. అక్కడ తొలిరోజున అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల్లో 'రంగస్థలం' మొదటి స్థానంలో వుంది. 1.65 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో 'రంగస్థలం' పేరుతో వున్న రికార్డును, తాజాగా 'భరత్ అనే నేను' అధిగమించడం విశేషం.          
Mahesh Babu
kiara advani

More Telugu News