మహేశ్ సత్తా చాటిన 'భరత్ అనే నేను' తొలిరోజు వసూళ్లు
Add ap7am to your home Screen

మహేశ్ సత్తా చాటిన 'భరత్ అనే నేను' తొలిరోజు వసూళ్లు

  • 'భరత్ అనే నేను'కి హిట్ టాక్ 
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
  •  బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు  
మహేశ్ బాబు ఇంతకుముందు చేసిన 'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు పరాజయాలను అందించాయి. దాంతో 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ మాట వినడం కోసం మహేశ్ .. ఆయన అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వాళ్లలో ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తూ ఈ సినిమా హిట్ టాక్ ను  సొంతం చేసుకుంది.

 తొలిరోజున ఈ సినిమా సాధించిన భారీ వసూళ్లే అందుకు కొలమానం. తొలిరోజున ఈ సినిమా నైజామ్ లో 5.55 కోట్లు .. సీడెడ్ లో 3.65 కోట్లు .. ఉత్తరాంధ్ర 2.91 కోట్లు .. పశ్చిమ గోదావరిలో 1.82 కోట్లు .. తూర్పు గోదావరిలో 3.20 కోట్లు .. గుంటూరులో 4.03 కోట్లు .. కృష్ణాలో 1.92 కోట్లు .. నెల్లూరు 88 లక్షలను వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 23.05 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం.       
Mahesh Babu
kiara advani

More Telugu News