గుంటూరు జిల్లాలో పవన్ రికార్డును క్రాస్ చేసిన మహేశ్
Add ap7am to your home Screen

గుంటూరు జిల్లాలో పవన్ రికార్డును క్రాస్ చేసిన మహేశ్

  • 'భరత్ అనే నేను'కు హిట్ టాక్ 
  • అంచనాలను అందుకున్న కొరటాల 
  • ప్రతి ఏరియాలో కొత్త రికార్డులు       
గతంలో 'శ్రీమంతుడు' సాధించిన సంచలన విజయం కారణంగా, 'భరత్ అనే నేను' పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో కొరటాల శివ .. మహేశ్ సక్సెస్ అయ్యారు. చెప్పుకోదగిన మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తూ దూసుకుపోతోంది.

తొలిరోజున ఈ సినిమా గుంటూరు జిల్లాలో 4.03 కోట్ల షేర్ ను సాధించింది. 'బాహుబలి' సినిమాను మినహాయిస్తే, ఇంతవరకూ ఈ జిల్లాలో తొలిరోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా 'అజ్ఞాతవాసి' నిలిచింది. 3.79 కోట్ల షేర్ తో 'అజ్ఞాతవాసి' పేరు మీదున్న రికార్డును, తాజాగా 'భరత్ అనే నేను' అధిగమించింది. కృష్ణా జిల్లాలోను 1.92 కోట్ల షేర్ వసూలు చేసి మరో రికార్డును సృష్టించడం విశేషం. ఇక వీకెండ్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.      
Mahesh Babu
kiara advani

More Telugu News