అల్లు అరవింద్‌కి.. తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ!

19-04-2018 Thu 21:24 | Entertainment
  • అల్లు అరవింద్ నా వీడియో చూడలేదని తెలుస్తోంది
  • దగ్గుబాటి సురేష్‌తో మాట్లాడి రూ.5 కోట్లు ఇప్పిస్తానన్నాను
  • అంతే కానీ పవన్ కి, ఆ 5 కోట్లకి సంబంధం లేదు
  • కనీసం ఇప్పుడైనా ఆ వీడియో చూడండి
'గౌరవనీయులైన అల్లు అరవింద్ గారి కామెంట్స్ కి నా సమాధానం' అంటూ తనపై ఆయన చేసిన విమర్శలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అల్లు అరవింద్ తనపై చేసిన ప్రతి వ్యాఖ్యకు సమాధానం చెప్పారు.

ఆయన చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ యథాతథంగా....

అరవింద్  గారి కామెంట్: ఒక మనిషికి కొన్ని రోల్స్ ఉంటాయి.. ఇండస్ట్రీలో సీనియర్ గా నాకు గౌరవం ఉంది.
RGV: ఎవరు కాదన్నారు? ఎవరు లేదన్నారు?

అరవింద్ గారి కామెంట్: శ్రీరెడ్డి వ్యవహారంపై చాలా సార్లు ఛాంబర్ లో చర్చించాం. రెండు మీటింగ్స్ లో పాల్గొన్నా
RGV: అది బహిరంగంగా చర్చించాల్సిన విషయం.. పవన్ విషయానికి ఇంత ఫాస్టుగా వచ్చారు కానీ, ఆ  విషయంలో ఇండస్ట్రీకి అంత పెద్ద సీనియర్ గా నెల రోజులుగా ఒక చిన్న కామెంట్ కూడా చెయ్యలేదు మీరు.

అరవింద్ గారి కామెంట్: అంతర్గతంగా ప్రభుత్వం నిబంధనలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.. సినీ పరిశ్రమలో మహిళపై లైంగికంగా వేధిస్తే కమిటీ ద్వారా విచారణ చర్యలు తీసుకుంటాం
RGV: అదే కదా నేను 20 రోజుల నుంచీ నెత్తీనోరు బాదుకుంటూ అరుస్తున్నది.

అరవింద్ గారి  కామెంట్: ఇండస్ట్రీ తీసుకుంటున్న కమిటీలో నేను మెంబర్ గా ఉంటున్నా
RGV:గ్రేట్..

అరవింద్  గారి  కామెంట్: ఇండస్ట్రీ కి RGV చాలా ద్రోహం చేస్తున్నాడు
RGV: పవన్ కల్యాణ్ లాంటి లక్షలమంది ఫాన్స్ ఉన్న తనని అలాంటి మాట అనిపించి, నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను కాని ఇండస్ట్రీకి ఎలా ద్రోహం చేస్తున్నాను?

అరవింద్ గారి కామెంట్: నిన్న RGV కి చెందిన వీడియో చూశాను. శ్రీ రెడ్డి పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వెనక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడన్నది స్పష్టం అయ్యింది.
RGV: వీడియోలో ఆ తప్పు చేసింది నేనేనని చెప్పింది నేనే కదా ..ఇంకా అందులో స్పష్టమవడానికి ఏముంది?

అరవింద్ గారి  కామెంట్: రూ.5 కోట్లు శ్రీరెడ్డికి ఆఫర్ చేసిన సొమ్ము ఎక్కడిది..? అతని ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు.
RGV: దీనితో మీరు వీడియో చూడలేదని తెలుస్తోంది.. సురేష్ తో మాట్లాడి అభిరామ్ విషయంలో ఇప్పించటానికి ట్రై చేస్తానని చెప్పాను... అంతే కానీ పవన్ కి, ఆ 5 కోట్లకి సంబంధం లేదు.. కనీసం ఇప్పుడైనా ఆ వీడియో చూడండి
 
అరవింద్ గారి కామెంట్: పవన్, ఫాన్స్ పై ఉన్న కోపంతో శ్రీరెడ్డిని పావును చేసి ఆడిస్తున్నావ్
RGV: సార్ అరవింద్ గారు, పవన్ ఫాన్స్ ప్రేక్షకులు, పైగా కోట్లమంది.. ఏ ఫిలిం మేకర్ అయినా ప్రేక్షకులతో కోపం కానీ కక్ష కానీ పెట్టుకుంటాడా?

అరవింద్ గారి కామెంట్: నీ అమ్మ, చెల్లిని నీ ముందు ఉంచి నాలుగు అక్షరాల ఇంగ్లిష్ బూతు పదం అంటే ఎలా ఉంటుంది.! కానీ మా నైతికత అది కాదు.
RGV: నా నైతికత కూడా అది కాదండీ.. నేనెప్పుడూ బూతు పదాలు వాడను.. కావాలంటే మీరెవరినైనా అడగచ్చు.. కానీ అక్కడి సందర్భం నేను వీడియోలో వివరించాను

అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీలో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన ఘనత RGV ది.
RGV: ఇండస్ట్రీ మీరా? పవన్ కల్యాణా? మీరు నాకు బ్రేక్ ఇచ్చారా? తల్లి పాలేంటి? నేను పవన్ ని అలా అని నా రొమ్ము నేను గుద్దుకున్నాను కానీ ఇంకెవరి రొమ్ము గుద్దలేదు  

అరవింద్ గారి కామెంట్: పవన్ స్థాయి తగ్గించడానికి నువ్వు చేస్తున్న పథకం వెనక ఎవరున్నారు...?
RGV: పవన్ ఒక ఆకాశమంత ఎత్తున్న సూపర్ స్టార్ లీడర్..అతని స్థాయి తగ్గించడానికి ఆఫ్ట్రాల్ నేనెవరిని? మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నా స్వభావం తప్ప నా వెనుక ఎవరూ కానీ, ఏ పార్టీకాని లేరు.. గత పదేళ్లుగా ఇన్సిడెంట్ల గురించి, దేవుళ్ల గురించి, సెలెబ్రిటీల మీద, గవర్నమెంట్ గురించి నేనెప్పుడూ ఏదో అంటూనే వచ్చాను.  

అరవింద్ గారి కామెంట్: రాంగోపాల్ వర్మ నీ చూడు..తాను చేసిన దానికి చాలా డిప్రెషన్ లో ఉన్నాను
RGV: అరవింద్ గారు, మీ మీద నాకు చాలా గౌరవముంది..ఎప్పటికీ ఉంటుంది..100% నేను చేసింది క్షమించరాని తప్పు.. మళ్లీ ఇంకొకసారి మీకు, పవన్ కల్యాణ్ కి, మీ కుటుంబ సభ్యులకీ ఫాన్స్ కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంతే కాకుండా మళ్లీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మీ మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను.

గతంలో నా ఒట్లు నేను నిలబెట్టుకోకపోయుండచ్చు.. కానీ మా మదర్ మీద నేనెప్పుడూ ఒట్టేయలేదు. 
allu aravindPawan KalyanRGV

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more