వెంకట రాహుల్‌కు ఏపీ సర్కారు భారీ నజరానా

19-04-2018 Thu 21:09 | Sports
  • రూ.50 లక్షల నగదు 
  • గుంటూరులో ఇంటి స్థలం
  • గ్రూప్‌-2 ఉద్యోగం
  • చంద్రబాబు ప్రకటన
ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిప్టింగ్ 85 కేజీల విభాగంలో స్వర్ణ పథకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సన్మానించారు. అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్ లో నిర్వహించిన ఈ 'అభినందన సభ'లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద బాబు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... వెంకట రాహుల్‌కి రూ.50 లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్లు, అలాగే ఆయన కోచ్‌కి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంకట రాహుల్‌కి గుంటూరులో ఇంటి స్థలం, గ్రూప్‌-2 ఉద్యోగం ఇస్తామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు అన్నారు. వెంకట రాహుల్ గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన క్రీడాకారుడన్న విషయం తెలిసిందే.  
ChandrababuAndhra PradeshCommonwealth Games

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more