చేసిన దాడులకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: రష్యా హెచ్చరిక
- సిరియాపై అమెరికా దాడి
- అమెరికా తమని బెదిరించే ప్రయత్నం చేస్తోందని రష్యా వ్యాఖ్య
- పుతిన్‌ని అవమానిస్తే అంగీకరించబోమని హెచ్చరిక
మరోసారి అమెరికా తమని బెదిరించే ప్రయత్నం చేస్తోందని అమెరికాలో రష్యా రాయబారి ఆంటోలీ ఆంటోనోవ్ వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడిని అవమానిస్తే తాము ఏమాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, సిరియాపై అమెరికా బీ1 బాంబర్లు, టోర్నడో జెట్స్, క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు తెలిసింది.