తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ కంటతడిపెట్టిన వీహెచ్!

13-04-2018 Fri 16:30 | Telangana
  • నాపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై దావా వేస్తా
  • సొంత పార్టీ నేతలే ఇలా చేయడం పార్టీకే నష్టం
  • పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తా
తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) కంటతడిపెట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఏడుగురు నేతలను విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించారని, ఈ విషయమై  పత్రికల్లో వార్తలు రాయడం అనైతికమని అన్నారు. తనపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు ఈ విధంగా కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టమని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని పత్రికల్లో తనపై అసత్య వార్తలు రాస్తున్నారని, ఇలాంటి వార్తలు రాసే ముందు వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. తనపై ఈ విధంగా వార్తలు రాసిన వారిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. పార్టీ కోసం నిరంతరం పాటుపడే తాను, ఎంతో మంది నాయకులను తయారు చేశానని, అలాంటి తనను బీసీలకు వ్యతిరేకమంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
TelanganaVH

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more