రాహుల్ గాంధీ అభిమానులపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం!
- అత్యాచార బాధితుల కోసం అర్థరాత్రి రాహుల్ నడక
- నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
- ఎందుకొచ్చామో తెలుసుకుని ప్రవర్తించండి
- కార్యకర్తలపై మండిపడ్డ ప్రియాంకా గాంధీ
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండి, మాట్లాడకుండా నడవాలని సూచించారు. ఏ కారణంతో ఇక్కడికి వచ్చామో అర్థం చేసుకుని బాధ్యతగల పౌరుల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాగా, తన భర్త రాబర్ట్ వాద్రాతో కలసి వచ్చిన ఆమె, ఇండియా గేట్ వద్ద రాహుల్ నిరసనలో జత కలిశారు. ఈ దేశం తమకు భద్రత నిస్తుందని ప్రతి మహిళా నమ్మేలా పరిస్థితులు మారాల్సి వుందని ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ అభిప్రాయపడ్డారు.