శ్రీరెడ్డితో కలిసి పనిచేయొద్దనే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఉండదు!: తమ్మారెడ్డి భరద్వాజ
- ఒక అమ్మాయి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే మనందరమూ సిగ్గుపడాలి
- మాట్లాడుకోవాల్సింది ఆ అమ్మాయి గురించి కాదు
- లేవనెత్తిన సమస్య గురించి
ఆ అమ్మాయి లేవనెత్తిన సమస్య ఉందా? లేదా? ఒకవేళ ఉంటే ఎలా అరికట్టాలి? దానికి కొన్ని పరిష్కారాలు నేను చెప్పాను. ఇప్పుడు మళ్లీ మాట్లాడుకోవచ్చు. అసలు, ఈ పరిస్థితి రానివ్వచ్చా? ఆలోచించడానికి సంఘాలున్నాయి కదా అని మనం ఆలోచించడం మానేశాం. వాళ్లు ఉన్నారులే, మనం ఆలోచించేదేమిటంటూ సంఘాలు, సంఘాల్లో నాయకులు ఆలోచించడం మానేశారు. దీంతో, ఈ సమస్య జటిలమైపోతోంది. ఒక అమ్మాయి ఛాంబర్ ముందుకొచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే..మనందరమూ సిగ్గుపడాల్సిన విషయం. ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడటం కంటే కూడా ఆ పరిస్థితి వచ్చినందుకు మనందరమూ సిగ్గుతో తలొంచుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.