సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

12-04-2018 Thu 07:32 | Entertainment
  • రవితేజ నాయికగా కేథరిన్ 
  • మెగా హీరోకి వెరైటీ టైటిల్ 
  • ఎన్టీఆర్ పై మరో బయోపిక్ 
  • మహేశ్ సినిమాలో 'అర్జున్ రెడ్డి' నాయిక
*  ప్రస్తుతం 'నేల టిక్కెట్టు' చిత్రంలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. తమిళంలో వచ్చిన 'తేరి' చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ చిత్రంలో ఓ కథానాయికగా  కేథరిన్ త్రెసాను ఎంపిక చేశారు. మరో నాయిక పాత్ర కోసం ఎమీ జాక్సన్ ను సంప్రదిస్తున్నారట.
*  మెగా హీరో సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ చిత్రానికి 'తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమకథ' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా మరో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రాన్ని 'నందమూరి తారక రామారావు ఆత్మఘోష' పేరిట నట్టికుమార్ నిర్మిస్తారు.
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో 'అర్జున్ రెడ్డి' ఫేం షాలిని పాండే ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. అశ్వనీదత్, దిల్ రాజు కలసి సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.   
CatherinSaiNTRMahesh Babu

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more