jagan: జగన్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: టీటీడీపీ
- చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు దారుణం
- జగన్ వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
- రాజకీయాలకు జగన్ అనర్హుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలను టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు ఖండించారు. జగన్ మాట్లాడుతున్న వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వారు అన్నారు. రాజ్యాంగం పట్ల జగన్ కు ఏమాత్రం అవగాహన లేదని... రాజకీయాలకు జగన్ అనర్హుడని తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వారు విరుచుకుపడ్డారు. దళితులపై కేసీఆర్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని... ఏ పంటకూ బీమా అందడం లేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో తెలపాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని అన్నారు.