మోదీ సర్కార్ పార్లమెంట్ ను ఆటబొమ్మగా మార్చేసింది : కేవీపీ
Add ap7am to your home Screen

మోదీ సర్కార్ పార్లమెంట్ ను ఆటబొమ్మగా మార్చేసింది : కేవీపీ

  • రాజకీయ పార్టీలన్నీ కలిసి మానవహారం నిర్వహించాం
  • ప్రతిపక్షాల ఐక్యతకు ‘మానవహారం’ నిదర్శనం
  • మోదీ పాలనలో అన్ని వర్గాల వారు అవస్థలు పడుతున్నారు
పార్లమెంట్ ను మోదీ సర్కార్ ఆటబొమ్మగా మార్చేసిందని, ఆయన పాలనలో అన్ని వర్గాల వారు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పార్టీలన్నీ కలిసి మానవ హారాన్ని నిర్వహించామని అన్నారు.

బ్యాంకు కుంభకోణాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఏపీకి ప్రత్యేకహోదా మొదలైన డిమాండ్లపై ఈ మానవహారం నిర్వహించామని, ప్రతిపక్షాల ఐక్యతకు ఇది నిదర్శనంగా నిలిచిందని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని, పార్లమెంట్ మెట్లు తాకే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శించారు. పార్లమెంట్ మెట్లకు మొక్కి చంద్రబాబు ఫొటోలకు పోజులిచ్చారని, సీఎంగా కొనసాగే అర్హత ఆయనకు లేదని అన్నారు.
kvp
Congress

More Telugu News