బళ్లారి నుంచి బరిలోకి దిగనున్న గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు?
Add ap7am to your home Screen

బళ్లారి నుంచి బరిలోకి దిగనున్న గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు?

  • బళ్లారి సిటీ నుంచి తమ్ముడు సోమశేఖరరెడ్డిని బరిలోకి దించనున్న ’గాలి’?
  • స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి?
  • జనార్దన్ రెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బళ్లారి నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని ప్రముఖ వ్యాపారవేత్త, గనుల కుంభకోణం కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణకు జనార్దన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తోంది. బళ్లారి సిటీ నుంచి తన తమ్ముడు సోమశేఖరరెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించాలని చూస్తున్నట్టు సమాచారం. భారీ మెజార్టీతో తన సోదరుడిని గెలిపించుకోవాలనే పట్టుదలతో జనార్దన్ రెడ్డి ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రయత్నాలు ప్రారంభించినట్టు ‘గాలి’ వర్గాల సమాచారం.

కాగా, బీజేపీ టిక్కెట్ పై తన సోదరుడు జనార్దన్ రెడ్డి పోటీ చేస్తారని సోమశేఖరెడ్డి చెప్పడం తెలిసిందే. అయితే, కర్ణాటకలో ఎన్నికల ప్రచార నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల అక్కడికి వెళ్లారు. బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డికి ఎటువంటి సంబంధాలు లేవని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
bellaray
gali janardhan reddy
soma shekar reddy

More Telugu News