ఆయనే, నా ఫేవరేట్ క్రికెటర్: ఐపీఎల్‌ తెలుగు ప్రచారకర్త జూ.ఎన్టీఆర్
Add ap7am to your home Screen

ఆయనే, నా ఫేవరేట్ క్రికెటర్: ఐపీఎల్‌ తెలుగు ప్రచారకర్త జూ.ఎన్టీఆర్

  • తొలిసారి స్టార్ స్పోర్ట్స్‌లో తెలుగు కామెంటరీతో ఐపీఎల్ మ్యాచ్‌లు
  • హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జూ.ఎన్టీఆర్‌
  • తన ఫేవ‌రెట్ క్రికెటర్ స‌చిన్ టెండూల్క‌ర్ అన్న తారక్ 
  • సరిహద్దులు లేని ఆట క్రికెట్ అని వ్యాఖ్య
త‌న ఫేవ‌రెట్ క్రికెటర్ స‌చిన్ టెండూల్క‌ర‌ని సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నారు. ఐపీఎల్ మ్యాచుల తెలుగు ప్రచార‌క‌ర్త‌గా ఎన్నికైన‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు ఐపీఎల్ నిర్వాహ‌కులు హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... చాలా మంది గొప్ప క్రికెటర్లు ఉన్నారని, వారిని తక్కువ చేసి మాట్లాడట్లేదని వ్యాఖ్యానించారు. తనకు క్రికెట్ గురించి అవగాహన వస్తోన్న వయసులో సచిన్ టెండూల్కర్ మాత్రమే తెలుసని, ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇష్టమని అన్నారు.

ఆట కూడా ఒక భాష అని తన అభిప్రాయమని, సరిహద్దులు లేని ఆట క్రికెట్ అని వ్యాఖ్యానించారు. తన సింహాద్రి సినిమా పెద్ద హిట్ కాగానే తనకు సిక్స్ కొట్టినట్లు అనిపించిందని అన్నారు. సినిమాల్లో డకౌట్లయిన (ప్లాప్స్) సందర్భాలు కూడా ఉన్నాయని, గెలుపు, ఓటములు సాధారణమేనని అన్నారు. తన కుమారుడు క్రికెటర్ కావాలో లేక ఎటువైపు వెళ్లాలో తాను నిర్ణయించబోనని, అతడి ఇష్టం ప్రకారం వెళ్లనిస్తానని తెలిపారు. కాగా, తొలిసారి స్టార్ స్పోర్ట్స్‌లో తెలుగు కామెంటరీతో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. 
Sachin Tendulkar
ntr
Cricket
ipl

More Telugu News