'ఎన్టీఆర్' బయోపిక్ లో కీలక పాత్రలో రాజశేఖర్?
Add ap7am to your home Screen

'ఎన్టీఆర్' బయోపిక్ లో కీలక పాత్రలో రాజశేఖర్?

  • ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పాత్ర కోసం రాజశేఖర్  
  • ఈ సినిమాలో పాత్రల ఎంపిక నిమిత్తం జరిగిన చర్చలు
  • ఆ పాత్ర రాజశేఖర్ కు ఇస్తే బాగుంటుందన్న బాలకృష్ణ
తేజ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నెల 29న ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకగా ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం హీరో రాజశేఖర్ ను ఎంపిక చేస్తారని తాజా సమాచారం.

ఈ సినిమాలో పాత్రల ఎంపిక నిమిత్తం జరిగిన చర్చల్లో రాజశేఖర్ కు చంద్రబాబు పాత్ర ఇస్తే బాగుంటుందని బాలకృష్ణ అభిప్రాయపడినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కాగా, బాలకృష్ణ సినిమాలో చిన్నపాత్రలో నటించే అవకాశం ఇచ్చినా చేస్తానని ఆమధ్య ‘గరుడవేగ’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో రాజశేఖర్ అనడం, ఇందుకు బాలయ్య స్పందిస్తూ, ‘చిన్నపాత్ర ఎందుకు? మల్టీ స్టారర్ చేద్దాం’ అని చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.
ntr biopic
hero rajashekar

More Telugu News