అందాల ఐశ్వర్యారాయ్ కి రేఖ అందమైన లేఖ!
- ఐశ్వర్యారాయ్ కు లేఖ రాసిన రేఖ
- బాలీవుడ్ లో ప్రవేశించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా అభినందనలు
- ఆరాధ్యకు తల్లిగా పోషిస్తున్న పాత్ర తనకు ఇష్టమన్న రేఖ
నువ్వు నోరు తెరిచి మాట్లాడేలోపే నీ నమ్మకం, నీ శక్తి మాతో మాట్లాడేస్తాయి. నువ్వు అనుకున్నవన్నీ సాధించావు. అది కూడా మా అందరి కళ్లూ నీ నుంచి మరల్చుకోలేనంత అందంగా సాధించావు. ఎన్నో కష్టాలు అనుభవించావు. ఫీనిక్స్ పక్షిలా వాటన్నింటినీ దాటి పైకి ఎదిగావు. నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నానన్నది మాటల్లో వర్ణించలేకపోతున్నాను. నువ్వు వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించావు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించావు. అయితే నువ్వు చేసిన అన్ని పాత్రల్లో నాకు ఇష్టమైనది, ప్రస్తుతం నువ్వు పోషిస్తున్న ఆరాధ్యకు తల్లి పాత్ర. ఆరాధ్యని ప్రేమిస్తూనే ఉండు, నీ మ్యాజిక్ ని పంచుతూనే ఉండు. నీ హృదయం మోయలేనన్ని, పట్టలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. లవ్ యూ జీతే రహో" అంటూ రేఖ లేఖను ముగించింది.