లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్
Add ap7am to your home Screen

లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్

  • వేధింపులపై మహిళలు మాట్లాడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం
  • వేధింపులు ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు
  • అన్ని రంగాలవారు దీనిపై ధైర్యంగా మాట్లాడుతున్నారు
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై నటీమణులు ఈ మధ్య కాలంలో ధైర్యంగా మాట్లాడుతుండటం తెలిసిందే. హాలీవుడ్ సినీ ప్రముఖుడు హార్వీ వీన్ స్టీన్ భాగోతం వెలుగు చూసినప్పటి నుంచి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా లైంగిక వేధింపులపై బాహాటంగా మాట్లాడుతున్నారు.

'మీ టూ' మూవ్ మెంట్ కింద సెలబ్రిటీలు తమకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఈ అంశంపై స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమకు ఎదురైన దారుణాల గురించి మాట్లాడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పింది. ఈ వేధింపులు ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని తెలిపింది. వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడటం సినిమా, వాణిజ్య రంగాలకే పరిమితం కాలేదని... అన్ని రంగాలవారు దీనిపై మాట్లాడుతున్నారని చెప్పింది.  
Aishwarya Rai
sexual abuse
Bollywood

More Telugu News