రాజమౌళి కొత్త సినిమాపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటన.. 'ఆర్‌ఆర్‌ఆర్' పేరిట వీడియో విడుదల
- రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా
- ఆర్ఆర్‌ఆర్ అంటూ వీడియో విడుదల చేసిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
- ప్రేక్షకుల్లో పెరిగిన ఆసక్తి
రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి మల్టీస్టారర్ మూవీ తీయనున్నాడని వార్తలు రావడమే కానీ అధికారికంగా ఈ సినిమాపై ప్రకటన మాత్రం రాలేదు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ తమ యూట్యూబ్ చానెల్ ఆర్ఆర్ఆర్ (రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు) అంటూ ఈ వీడియో విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ వీడియోపై స్పందించిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. తన ట్విట్టర్ ఖాతాల్లో దీన్ని పోస్ట్ చేసి 'ఇది ఏమిటి రామ్‌చరణ్?' అని ప్రశ్నించింది.