సూర్య సరసన ప్రియా వారియర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు...!
Add ap7am to your home Screen

సూర్య సరసన ప్రియా వారియర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు...!

  • సూర్య సినిమాలో ప్రియా నటించడం లేదని దర్శకుడు స్పష్టీకరణ
  • లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించనుందని వెల్లడి
  • ఈ చిత్రానికి హ్యారీస్ జైరాజ్ సంగీతం
ఒక్క స్పెషల్ 'ఎక్స్‌ప్రెషన్‌'తో సోషల్ మీడియా రారాణిగా మారిపోయిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు బాలీవుడ్ నుంచే కాక కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్ సరసన ఆమె నటించనుందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఇటీవల తేలిపోయింది. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్న ఓ సినిమాలోనూ ఆమె కథానాయికగా ఎంపికైనట్లు రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టమయింది.

అసలు విషయమేమిటంటే... వీడొక్కడే, బ్రదర్స్ ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో హీరోయిన్ కోసం ప్రియా ప్రకాశ్ వారియర్‌ను తాను సంప్రదించానంటూ వచ్చిన పుకార్లపై ఎట్టకేలకు దర్శకుడు కేవీ ఆనంద్ స్పందించారు. అసలు ఆమెను సంప్రదించనేలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌ నటించనుందని ఆయన తెలిపారు. హ్యారీస్ జైరాజ్ బాణీలు సమకూర్చనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే...
KV Anand
Suriya
Lyca Productions
Priya Prakash Warrier

More Telugu News