ఎన్టీఆర్ తో యాక్ట్ చేయడానికి పూజా హెగ్డే భయపడుతోందట!
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ తో యాక్ట్ చేయడానికి పూజా హెగ్డే భయపడుతోందట!

  • ఎన్టీఆర్ మంచి డాన్సర్ 
  • ఈ విషయంలో మెప్పించగలను 
  • ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అట 
  • అదే నన్ను కంగారు పెట్టేస్తోంది
త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఆయన, నటీనటుల ఎంపిక ప్రక్రియలో బిజీగా వున్నారు. ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ అవకాశం లభించడం పట్ల పూజా హెగ్డే ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి చాలా భయం వేస్తోందని ఆమె సన్నిహితులతో అంటోందట.

ఎన్టీఆర్ మంచి డాన్సర్ .. తనకి కూడా డాన్స్ విషయంలో అంతో ఇంతో నైపుణ్యం వుంది కనుక నెట్టుకురావొచ్చు. కానీ ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఆమెతో చాలామంది చెప్పారట. దాంతో ఆయన కాంబినేషన్లోని సీన్స్ ను తాను ఒకే ఒక్క టేక్ లో చేయగలనా .. లేదా? అనే భయం పట్టుకుందట. త్రివిక్రమ్ హెల్ప్ తీసుకుని ముందుగానే ప్రిపేరైపోవాలనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.   
ntr
pooja hegde

More Telugu News