ఎన్టీ రామారావు బయోపిక్ వివరాలు, టైటిల్ ను అనౌన్స్ చేసిన బాలకృష్ణ
Add ap7am to your home Screen

ఎన్టీ రామారావు బయోపిక్ వివరాలు, టైటిల్ ను అనౌన్స్ చేసిన బాలకృష్ణ

  • వెలగపూడికి వచ్చిన బాలకృష్ణ
  • మీడియాతో చిట్ చాట్
  • 29 నుంచి బయోపిక్ షూటింగ్ మొదలు
దివంగత ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రం షూటింగ్ ఈ నెల 29న ప్రారంభమవుతుందని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ వెల్లడించారు. ఈ ఉదయం వెలగపూడి అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, బయోపిక్ డేట్ ను అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లోని రామకృష్ణా సినీ స్టూడియోలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సాధ్యమైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ఇదేమీ ఎన్నికల సందర్భంగా తీసే చిత్రం కాదని, వచ్చే సంక్రాంతి నాటికి చిత్రాన్ని విడుదల చేయాలన్న తలంపుతో ఉన్నామని బాలయ్య వెల్లడించారు. ఎన్నికలకు, రాజకీయాలకు, ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధం లేదని వెల్లడించారు. సినిమాకు చాలా మంది చాలాపేర్లు సూచించారని, 'ఎన్టీఆర్' అన్న పదానికి మించిన పేరు మరొకటి ఉండదన్న ఉద్దేశంతో ఆ పేరునే ఖరారు చేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ను ఆదరించి, అభినందించినవారేనని అన్నారు.
NTR
Balakrishna
Bio Pic
Shooting

More Telugu News