నిజాం నవాబు వారసుడి కన్నుమూత!
- హైదరాబాదును పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
- ఆయన తనయుడే నవాబ్ ఫజల్ జహా బహదూర్
- పూర్వీకుల సమాధుల పక్కనే అంతిమ సంస్కారం
నిజాం పాలన అంతమైన తరువాత నిజాంకు సంబంధించిన వివిధ ట్రస్టుల వ్యవహారాలను నవాబ్ ఫజల్ జహా బహదూర్ చూసుకున్నారు. సౌదీ అరేబియాలో హజ్ యాత్రికుల బస కోసం నిజాం నిర్మించిన అతిథిగృహం ‘హైదరాబాద్ రుబాత్’ వ్యవహారాల బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించారు. కాగా, ఆయనకు భార్య సాహెబ్ జాదీ దర్వేరున్నీసాబేగం, వారసుడు (కుమారుడు) ఉన్నారు.